Kadapa
ఇదే మన కడప జిల్లా బాబు!
రాయలసీమ గుండెకాయలా నిలిచిన చారిత్రక నేల ఇది.
గండికోటను ‘భారతదేశ గ్రాండ్ క్యానియన్’ అంటారు… చూసినవాళ్లు ‘అయ్యో బాబోయ్ ఎంత అద్భుతం!’ అనకుండా ఉండలేరు.
పుష్పగిరి క్షేత్రం, సిద్ధవటం కోట లాంటి చారిత్రక కట్టడాలు ఈ జిల్లాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
పెన్నా నది ఈ నేలకి జీవనాడి… వ్యవసాయానికి ప్రధాన ఆధారం.
చరిత్ర, సంస్కృతి, ధైర్యం కలిసిన నేలే మన కడప జిల్లా బాబోయ్!”
ఈనెల 14న కడపలో జిల్లా భూ సదస్సు
సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్
జిల్లాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలకు భూములు పంచాలని డిమాండ్
ఎస్వీ డిగ్రీ కాలేజ్ సమీపంలో జిల్లా స్థాయి భూ సదస్సు
వ్యాకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు హాజరు
కడప జిల్లాలో ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన జిల్లా భూ సదస్సు నిర్వహించనున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడపలో జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు జి. శివకుమార్ పిలుపునిచ్చారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని, మరో లక్ష ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయిందని ఆయన ఆరోపించారు. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు.
