KAKINADA
కాకినాడ జిల్లా
కాకినాడ ప్రాంతంలో కోస్తా తెలుగు మాధుర్యంతో కూడిన యాస వినిపిస్తుంది.
తీరప్రాంత జీవన విధానం భాషలో కనిపిస్తుంది.
వ్యాపార సంస్కృతి ప్రభావంతో మాటల్లో వేగం ఉంటుంది.
సరళమైన ఉచ్చారణ ఈ ప్రాంత ప్రత్యేకత.
సముద్రతీర సంస్కృతిని ప్రతిబింబించే భాషగా ఇది నిలుస్తుంది.
వేట్లపాలెం భారీ పేలుడులో 28 చేరిన మృతుల సంఖ్య
భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడి
ఈ నెల 31న ముగియనున్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ లైసెన్స్ గడువు
లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా ముడి పదార్థాలు నిల్వ
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం శివారులో ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 28కు చేరింది. బాణాసంచా తయారీ సమయంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. యూనిట్‌లో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 8 మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 28కు చేరింది. ప్రస్తుతం ఇద్దరు గాయపడిన వారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మరియు వెంకట చలపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పెద్దాపురం ఇన్‌చార్జ్ డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యూనిట్ యజమాని అడబాల అర్జున్ మరియు అడబాల వీరబాబులను పోలీసులు అరెస్టు చేశారు. లైసెన్స్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ముందుగానే అధిక పరిమాణంలో బాణాసంచా తయారు చేసి విక్రయించాలని యజమానులు నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా ముడి పదార్థాలు నిల్వ చేయడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవంలేని కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించడం వంటి కారణాల వల్లే ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది. దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.


