KAKINADA
కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా తూర్పు గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం సముద్రతీరం విస్తరించింది.
గోదావరి కాలువలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
తీర మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం.
నది–సముద్ర తీర ప్రాంత కలయిక కాకినాడ ప్రత్యేకత
ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి
సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం, సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై 450 అర్జీలు అందాయని తెలిపారు.
ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందుతున్న అర్జీలపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
