KAKINADA
కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా తీరప్రాంత ప్రకృతి అందాలతో ప్రసిద్ధి.
గోదావరి డెల్టా ప్రభావం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది.
సముద్రతీరాలు, కాలువలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ.
ఆక్వా సాగు, వ్యవసాయం ప్రధాన జీవనాధారం.
నది–సముద్రం కలిసిన ప్రకృతి కాకినాడ ప్రత్యేకత.
• కాకినాడలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
• మహిళా శక్తికి వేదికగా మారిన కార్యక్రమం
• డ్వాక్రా గ్రూపుల మహిళలకు ప్రత్యేక సత్కారం
• సెర్ఫ్ సభ్యుల స్టాల్స్ ఆకట్టుకున్న వేడుకలు
• జిల్లా నలుమూలల నుంచి భారీగా మహిళల పాల్గొనడం
• ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హాజరు
కాకినాడ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సెర్ఫ్, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కాకినాడ కుళాయి చెరువు పార్క్ సమీపంలోని ఫెభిన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ మనీషా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ ఛాంపియన్‌షిప్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన మహిళలు, డ్వాక్రా గ్రూపుల ద్వారా వివిధ రంగాల్లో స్థిరపడిన మహిళలను సత్కరించారు. అలాగే సెర్ఫ్ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
