Kakinada good morning ap
కాకినాడ జిల్లా
ఈ జిల్లాలో కొబ్బరి తోటలు విస్తృతంగా కనిపిస్తాయి.
గోదావరి డెల్టా ప్రభావంతో వరి పంట కూడా పెద్ద ఎత్తున సాగుతుంది.
తీర ప్రాంతం కావడంతో మత్స్యకారంతో పాటు ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందింది.
సారవంతమైన భూములు పంటలకు అనుకూలంగా ఉంటాయి.
వ్యవసాయం మరియు మత్స్యకారం ఈ జిల్లాకు ప్రధాన జీవనాధారం.
కాకినాడ జిల్లాలో గెస్ట్ హౌస్‌లు, లాడ్జ్‌లలో ప్రత్యేక తనిఖీలు
నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
లాడ్జ్‌లలో రిజిస్టర్ ఎంట్రీలు, సీసీకెమెరాలు పరిశీలన
చట్టపరమైన నిబంధనలు పాటించని లాడ్జ్‌లపై..
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు
సున్నితమైన ప్రాంతాల్లో వజ్ర పహార్, కార్డెన్ సెర్చ్
కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు అనైతిక కార్యకలాపాలు, నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో లాడ్జ్‌లు మరియు గెస్ట్ హౌస్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీసు అధికారులు లాడ్జ్‌లలో ఉండే అతిథుల వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్‌లు, రిజిస్టర్ ఎంట్రీలు, సీసీ కెమెరాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. లాడ్జ్ యాజమాన్యాలు ప్రతి అతిథుల సరైన వివరాలను నమోదు చేయాలని, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులకు గదులు ఇవ్వకూడదని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లాడ్జ్ యజమానులకు సూచించారు. పోలీసులు హెచ్చరిస్తూ, చట్టపరమైన నిబంధనలు పాటించని లాడ్జ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత మరియు నేరాల నివారణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు జిల్లాలో కొనసాగుతాయని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
