ANANTAPURAM
అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో పున:నిర్మాణం పనులు
ఆంజనేయస్వామి గర్భగుడిని కూల్చివేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ నూతన నిర్మాణం
రూపురేఖలు మారిపోనున్న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం
రాయలసీమ హృదయభూమిగా వెలసిన అనంతపురం జిల్లా ధైర్యసాహసాలకు, కృషి పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది. ఎండలను జయించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఈ నేల చరిత్ర, ఆధ్యాత్మికత, పరిశ్రమల పురోగతితో రాష్ట్ర గర్వకారణంగా నిలుస్తోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆలయం కసాపురం ఆంజనేయస్వామి గర్భగుడిని కూల్చివేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కసాపురం ఆంజనేయ స్వామి వారి గర్భ గుడిని నేలమట్టం చేశారు.. సనాతన పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చాడమా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కొంత మంది దాతలు ఆలయ అభివృద్ధికి కోసం రూ. కోట్లలో విరాళాలు ఇచ్చారు. దీంతో ఆలయంలో పునర్ని్ర్మాణ పనులు చేపడుతున్నారు.
రాయచూర్‌కు చెందిన రాజేంద్రరెడ్డి అనే వ్యక్తి కసాపురం దేవాలయ పునఃనిర్మాణానికి భారీ విరాళం ఇచ్చారు. గర్భగుడి, విమానగోపురం, అర్ధమండపం, ఆలయ శిఖరాన్ని రూ.5 కోట్ల సొంత ఖర్చుతో తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అంజనీ ప్రసాద్ అనే వ్యక్తి నాలుగు కోట్ల రూపాయల సొంత డబ్బులతో దేవస్థానం మహామండపం నిర్మాణ పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలాలయ ప్రతిష్టాపన తర్వాత మూలవిరాట్ మినహా మిగిలిన ప్రాకారం తొలగించనున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే.. జూన్ నెలలో నూతన దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఉండనుంది. అలాగే దక్షిణ రాజగోపురం ముందు భక్తులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా లడ్డూ తయారీ, ప్రసాదాల కౌంటర్ల గదులు, వసతి గదులు నిర్మించనున్నారు. మొత్తంగా కసాపురం ఆలయం రూపురేఖలు మార్చేలా అధికారులు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయంలోని కొన్ని నిర్మాణాలను తొలగించినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ అందిస్తారు.


