konaseema good morning ap
కోనసీమ జిల్లా
ఈ జిల్లా కొబ్బరి తోటలకు ప్రసిద్ధి.
అదనంగా వరి, అరటి పంటలు విస్తృతంగా సాగుతాయి.
నదుల మధ్యలో ఉన్న భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
పచ్చని తోటలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందం తీసుకొస్తాయి.
వ్యవసాయం ఈ జిల్లాకు ప్రధాన ఆదాయం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మహేష్ కుమార్
రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు
హోటళ్ళు, రెస్టారెంట్ల అనధికారిక గ్యాస్ వాడకంపై…
కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో LPG గ్యాస్ ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ 25 గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు కొరత రాకుండా ప్రభుత్వ దిశానిర్దేశాలు అమలు చేయాలని, పానిక్ బుకింగ్‌లు చేయవద్దని సూచించారు. దేశంలో LPG కొరత లేదని, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, ఆసుపత్రులు, సంక్షేమ శాఖలకు సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. డీఓలు, డీఇఓలు, డిఎంహెచ్వోలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 9441692275 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ప్రచారం చేయాలన్నారు. మండలాల్లో కూడా తహశీల్దార్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహాలకు వినియోగించే సిలిండర్ల మళ్లింపు, హోటళ్ళ అనధికార వాడకాన్ని కఠినంగా అరికట్టాలని హెచ్చరించారు. డీలర్లు ఆన్‌లైన్ ఓటిపి బుకింగ్‌లకు మాత్రమే సరఫరా చేయాలని, ఏజెన్సీల వద్ద నోటీసు బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.
