KONASEEMA
కోనసీమ జిల్లా
కోనసీమ జిల్లా గోదావరి నది డెల్టా ప్రాంతంలో ఉంది.
గౌతమీ, వశిష్ఠ వంటి గోదావరి పాయలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
డెల్టా మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం.
నదీ కాలువలు ఈ ప్రాంతాన్ని విభజిస్తాయి.
నదీ డెల్టా ప్రాంతంగా కోనసీమ జిల్లా ప్రసిద్ధి.
అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం
మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పథకాలు…
అందిస్తుందన్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రధానం
మహిళల సాధికారతకు ప్రభుత్వాలు ఎన్నో పధకాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రతీ మహిళా ఆర్థికంగా బలోపేతం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. ప్రతీ మహిళా రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 1,290 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి రుణాలుగా మంజూరు చేశామని చెప్పారు. ఏ రంగంలో చూసినా నేడు మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రధానం చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.
