KONASEEMA
కోనసీమ జిల్లా
కోనసీమ యాస తీయనైన కోస్తా తెలుగు మాధుర్యానికి ప్రతీకగా ఉంటుంది.
పల్లె సంస్కృతి ప్రతిబింబించే సున్నితమైన పదాలు ఎక్కువగా వినిపిస్తాయి.
మాటల్లో సౌమ్యత, ఉచ్చారణలో నెమ్మదితనం ప్రత్యేకత.
వ్యవసాయ జీవితం, నదీ డెల్టా సంస్కృతి భాషలో కనిపిస్తాయి.
మాధుర్యమైన ప్రాసతో కోనసీమ భాష ప్రత్యేక గుర్తింపు పొందింది.
మహిళా దినోత్సవం ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష
మహిళా భద్రతకు, విద్యకు, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత
7వ తేదీన మహిళా పోలీసులతో జిల్లా కలెక్టర్ నుంచి గడియార స్తంభం వరకు బైక్ ర్యాలీ
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్ట లేనిదని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల8 వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవ ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ, తమదైన ముద్ర వేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు బాటలు వేయాలన్నారు.
జిల్లా యంత్రాంగం తరపున మహిళా భద్రతకు, విద్యకు మరియు ఆరోగ్యానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళలు తమలోని శక్తిని గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సుల నిర్వహణ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ మహిళా సంఘాల అభివృద్ధి, ఆర్థిక సాధికారతకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
7వ తేదీన మహిళా పోలీసులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.


