KRISHNA GOOD MORNING AP
కృష్ణా జిల్లా
కృష్ణా నది డెల్టా ప్రాంతం కావడంతో వరి పంట విస్తృతంగా పండుతుంది.
అదనంగా మిర్చి, పత్తి, పూల సాగు కూడా అభివృద్ధి చెందింది.
కూరగాయల సాగు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
సారవంతమైన నేల పంటలకు అనుకూలంగా ఉంటుంది.
వ్యవసాయం ఈ జిల్లాలో ప్రధాన ఆర్థిక ఆధారం.
కృష్ణాజిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ఎత్తివేసిన అధికారులు
జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరవుతున్న 22,232 విద్యార్థులు
పరీక్షల నిర్వహణ కోసం 1500 మంది ఇన్విజిలేటర్లు నియామకం
కృష్ణాజిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను అధికారులు ఎత్తివేశారు. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొంత ఊరటగానే చెప్పుకోవచ్చు. నేటి నుంచి ఏప్రిల్ ఒకటి వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్ష సమయాన్ని విద్యార్థులకు కేటాయించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విద్యార్థులు పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు ఆలస్యంగా వచ్చిన లోపలికి అనుమతించే అవకాశం కల్పించారు. మొత్తంగా కృష్ణజిల్లాలో 22 వేల 232 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతుండగా, 148 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 1500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇదిలా ఉండగా హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.
