KRISHNA
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో స్వచ్ఛమైన తెలుగు యాస వినిపిస్తుంది.
సాహిత్యానికి దగ్గరగా ఉన్న పలుకుబడి ప్రత్యేకత.
మాటల్లో స్పష్టత, ఉచ్చారణలో మాధుర్యం కనిపిస్తాయి.
వ్యవసాయం, వాణిజ్యం ప్రభావం భాషలో కనిపిస్తుంది.
సాంప్రదాయ తెలుగు యాసకు ప్రతీకగా కృష్ణా నిలుస్తుంది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊరట…
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలో కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష
పరిశ్రమలకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిస్తామని హామీ
కృష్ణా జిల్లాలో పరిశ్రమలకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిస్తామని పారిశ్రామికవేత్తలు సత్వరమే వారి యూనిట్లు స్థాపించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. పెనమలూరు మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో పరిశ్రమల స్థాపన, సంబంధిత సమస్యలు అనే అంశంపై అధికారులతో, పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ సమీక్షించారు. మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలలో పరిశ్రమలు నెలకొల్పుటకు పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పలువురు పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన స్థలాలు లోతట్టుగా ఉన్నాయని వాటిని మెరక చేయుటకు మట్టి అవసరం ఉందని చెప్పారు. పారిశ్రామిక వాడలో సరైన భద్రత లేదని, వాచ్మెన్ సరిగా విధుల్లో ఉండటం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, తాము తెచ్చుకున్న సామాగ్రి చోరీకి గురవుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించి పరిష్కారం చూపుతామన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.


