KURNOOL GOOD MORNING AP
కర్నూలు జిల్లా – ఇంట్రో
ఇది కర్నూలు జిల్లా!
నల్లమల కొండలు ఈ జిల్లాకు సహజ సంపద.
ఈ పర్వత ప్రాంతాల్లో అడవులు, లోయలు విస్తరించి ఉన్నాయి.
బెలుమ్ గుహలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.
యాగంటి ప్రాంతం కూడా కొండల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం.
ప్రకృతి, చరిత్ర కలిసిన ప్రాంతం ఇదే.
ఏపీలో ముమ్మరంగా సాగుతున్న పదో తరగతి పరీక్షలు
కర్నూలు జిల్లాలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్
పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా
పరీక్షా కేంద్రాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది: కలెక్టర్ సిరి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ సిరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. కర్నూలు నగరంలోని ఏ-క్యాంప్‌లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షా కేంద్రాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు.
