KURNOOL
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా రాయలసీమ ఉత్తర భాగంలో ఉంది.
నల్లమల పర్వత శ్రేణులు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
తుంగభద్ర, హంద్రీ నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తాయి.
పీఠభూమి మరియు కొండ ప్రాంతాలు ఉన్నాయి.
పర్వత–పీఠభూమి భౌగోళిక నిర్మాణం కర్నూలు ప్రత్యేకత
ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పని కల్పించడంలో…
కోసిగి మండలం ప్రథమ స్థానంలో ఉంది: ఏపీవో అబ్దుల్ ఖాలిక్
జాబ్ కార్డు కలిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పిస్తామని హమీ
ఇప్పటి వరకు 2,74,532 మందికి ఉపాధి పనులు కల్పించామని వెల్లడి
విబి జిరామ్ జి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించడంలో కర్నూలు జిల్లాలో కోసిగి మండలం ప్రథమ స్థానంలో ఉందని ఏపీవో అబ్దుల్ ఖాలిక్ తెలిపారు. మండలంలో ఎవరూ వలసలు వెళ్లాల్సిన అవసరం లేదని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధి పనులు చేయాలనుకునే వారు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటివరకు మండలంలో 2 లక్షల 74 వేల 532 మందికి ఉపాధి పనులు కల్పించినట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ నెల నుంచి ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం 2025’ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన కొత్త చట్టమని తెలిపారు. ఈ చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు కల్పించే ఉపాధి హామీ రోజులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజల జీవనోపాధిని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీవో అబ్దుల్ ఖాలిక్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు.
