Kurnool good morning ap
కర్నూలు జిల్లా – వింతలు, విశేషాలు
ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా కర్నూల్ కు గుర్తింపు ఉంది.
బెలుమ్ గుహలు భారతదేశంలో అతిపెద్ద గుహలలో ఒకటి.
ఓర్వకల్ రాక్ గార్డెన్ సహజ రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి.
యాగంటి ఉమామహేశ్వర ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం.
తుంగభద్ర నది ఈ జిల్లాలో ముఖ్య జలవనరు.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి సమావేశం
ఈనెల 17న ముగియనున్న పాలక మండలి పదవీకాలం
పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్న మేయర్ రామయ్య
కర్నూలు నగర పాలక సంస్థలో పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నెల 17వ తేదీతో ఐదేళ్ల పదవీకాలం పూర్తికానుండటంతో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీకి చెందిన మేయర్ B. Y. రామయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నగరాభివృద్ధి, పెండింగ్లో ఉన్న పనులు, ఆర్థిక అంశాలు తదితర పలు ముఖ్య విషయాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
అయితే గత ఐదేళ్ల కాలంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లకు రంగులు వేయడం, కొన్ని చిన్నపాటి పనులు చేయడం మినహా నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెద్దగా మార్పులు కనిపించలేదని ప్రతిపక్షాలు మరియు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ బి.శ్రీనివాస్ అందిస్తారు.
