RAYALASEEMA (రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్)
కర్నూలు జిల్లా
ఒకప్పుడు రాజధానిగా నిలిచిన కర్నూలు జిల్లా చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. వ్యవసాయం, విద్యా రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు కర్నూలు వార్త.
నిధుల కొరతతో స్తంభించిపోయిన శ్రీశైలం మాస్టర్ ప్లాన్
మూడు దశల్లో శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయం
మొదటి దశలో ప్రధాన రహదారులను అభివృద్ధి చేసిన అధికారులు
ప్రత్యేక దినాలలో రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్న భక్తులు
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ పనులు నిధుల కొరతతో స్తంభించిపోయాయి. దేవస్థానానికి ఏటా వివిధ రూపాలలో ఆదాయం వస్తున్నప్పటికీ అందుకు తగ్గ అభివృద్ధి పనులను అధికారులు చేపట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దినాలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్వదినాలని మినహాయిస్తే శని, ఆదివారాలలో కనీసం రూములు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది.
ఈ పరిస్థితుల నుంచి శ్రీశైలాన్ని బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో గతంలో దేవస్థానం ఈవో భరత్ గుప్తా హయాంలో కొన్ని పనులు జరగగా, మిగిలిన పనులు స్తంభించిపోయాయి. శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులను మూడు దశలలో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మొదటి దశలో శ్రీశైలంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి చేపట్టిన అధికారులు మిగిలిన పనులను పూర్తిచేయలేకపోయారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.


