KURNOOL
కర్నూలు జిల్లా
రాయలసీమ యాసలోని గంభీరత కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది.
మాటల్లో బలం, భావ వ్యక్తీకరణలో స్పష్టత ఉంటుంది.
చారిత్రక నేపథ్యం భాషలో ప్రతిబింబిస్తుంది.
స్థానిక పదాల వినియోగం ఎక్కువగా ఉంటుంది.
రాయలసీమ సంస్కృతికి ప్రతిబింబంగా కర్నూలు యాస నిలుస్తుంది.
కర్నూలు జిల్లాలో ఆగిపోయిన ఉర్దూ యూనివర్సిటీలో నిర్మాణ పనులు
2016లో ఉర్దూ యూనివర్సిటీని మంజూరు చేసిన టీడీపీ ప్రభుత్వం
144 ఎకరాల్లో నిర్మించేందుకు 21 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిలిచిపోయిన పనులు
భవన నిర్మాణాలకు కోటి రూపాయల సొంత నిధులు మంజూరు చేసిన మంత్రి టీజీ భరత్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు ఆగిపోయాయి. 2016 లో టీడీపీ ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీని మంజూరు చేసింది. యూనివర్సిటీ కోసం ఓర్వకల్ వద్ద 144 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు 21 కోట్ల రూపాయలను అప్పట్లో మంజూరు చేసింది. 2018 జూన్ లో ఒప్పందం కుదుర్చుకొని 2019 మే 1 నాటికి పూర్తి కావాల్సి ఉంది.
అయితే ఈ భవన నిర్మాణాలను కాంట్రాక్టర్ ప్రారంభించి మూడు కోట్ల రూపాయల పనులను చేశాడు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా మంత్రి కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణాలకు కోటి రూపాయల సొంత నిధులను మంజూరు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు.


