SRIKAKULAM
ఉత్తరాంధ్ర మట్టి సువాసన… సముద్రపు గాలి తాకిడి… పల్లె సంస్కృతి పరిమళం… ఇవన్నీ కలిసిన నేల శ్రీకాకుళం.
ఇక్కడి ప్రజలు మాట్లాడే భాషలో ఒక ప్రత్యేక మాధుర్యం ఉంటుంది. సాధారణ తెలుగుకంటే కొంచెం భిన్నంగా వినిపించే ఈ యాస… ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
“ఎంట్రా బాబూ… ఎక్కడికెళ్తావు… ఏం చేస్తున్నావు…” వంటి మాటల్లో కనిపించే ఆ తీయని తీరే… శ్రీకాకుళం యాస ప్రత్యేకత
పలాసలో జోరుగా కొనసాగుతున్న కంకర తవ్వకాలు
బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో డీపట్టా భూముల్లో…
అనుమతులు లేకుండా కంకర తరలింపు
సుమారు వంద టిప్పర్లుకు పైగా కంకరను తవ్వినట్లు ఆనవాళ్లు
అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లా పలాసలో కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కోసంగిపురం రోడ్డు ప్రభుత్వ గృహ సముదాయం ప్రాంతంలో ఐదు ఎకరాల కంకర కొండలో అప్పటి కాలనీలో రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వినా మట్టి కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం భారీస్థాయిలో వారికి డబ్బులు చెల్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన కొండతోపాటు ఆ ప్రాంతంలో పది అడుగుల కిందకు కూడా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలించారు. ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నారు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో డీపట్టా భూముల్లో అనుమతులు లేకుండా కంకరను తరలిస్తున్నారు. భూమిని చదును చేసే పేరుతో మొత్తం ఆ ప్రాంతంలో ఇప్పటికి సుమారు వంద టిప్పర్లుకు పైగా కంకరను తవ్వినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కంకరను తవ్వి రహదారులు, పునాదుల్లో నింపేందుకు దీన్ని తరలిస్తున్నారు. దీనికికూడా మైనింగ్, రెవెన్యూశాఖ నుంచి అనుమతులు లేకపోవడం విశేషం. సాక్షాత్తు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష.. ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిరోజుల కిందట కంకర తవ్వకాల ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటివరకూ కంకర తవ్వకందారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా యథేచ్చగా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు.


