KRISHNA GOOD MORNING AP
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా తీర ప్రాంత మైదాన భూభాగంలో ఉంది.
కృష్ణా నది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.
డెల్టా ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి.
చిన్న కాలువలు, చెరువులు నీటి వనరులుగా ఉన్నాయి.
తీర ప్రాంత మైదానాలు విస్తరించాయి.
నది–డెల్టా మైదానాలు కృష్ణా జిల్లా ప్రత్యేకత
కృష్ణాజిల్లా మచిలీపట్నం సరికొత్త ఆధ్యాత్మిక శోభను
మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
కోదండ రామస్వామి దేవాలయంలో రాజ గోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవం
కృష్ణాజిల్లా మచిలీపట్నం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంటుంది. బందరు కోటలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రాజ గోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11:43 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాజ్ నాథ్ పాండే, కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి, గుడివాడ శ్రీ విద్యాపీఠం స్థైర్యానందు సరస్వతీ స్వామి తదితరులు హాజరుకానున్నారు.
ఆలయ నిర్మాణకర్తలైన కొల్లు రవీంద్ర దంపతులు ఇక్కడ నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా సుల్తాన్ నగరం నుంచి బందరు కోట వరకు ర్యాలీ నిర్వహించబడనుంది. మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బందరు కోట కోదండ రామస్వామి దేవస్థానం ఆలయ శిల రాజగోపుర శిఖర ప్రతిష్ట మహోత్సవములో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.
