KRISHNA
కృష్ణా జిల్లా
కృష్ణా నది ఈ జిల్లాకు ప్రధాన జలవనరు.
సారవంతమైన డెల్టా భూములు వ్యవసాయానికి అనుకూలం.
కాలువలు, పచ్చని పొలాలు ప్రకృతి అందాలు పెంచుతాయి.
సముద్ర తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి.
నది, సముద్రం కలిసిన ప్రకృతి కృష్ణా జిల్లా ప్రత్యేకత.
• మచిలీపట్నం టౌన్ హాల్‌కు పూర్వ వైభవం తీసుకురావాలన్న యత్నం
• శిథిలావస్థలో ఉన్న చారిత్రక టౌన్ హాల్
• అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష
• ఆధునిక ఫంక్షన్ హాల్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక
• మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి
• పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న చారిత్రక కట్టడాల్లో టౌన్ హాల్ ఒకటి. ఒకప్పుడు పట్టణ ప్రజలకు ముఖ్యమైన కార్యక్రమాల వేదికగా నిలిచిన ఈ టౌన్ హాల్ గత కొన్నేళ్లుగా మూతపడి శిథిలావస్థకు చేరింది. దీంతో పట్టణవాసులు ఆ కట్టడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎంతో ఘనంగా వెలుగొందిన మచిలీపట్నం టౌన్ హాల్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై ధీనావస్థలో ఉంది. అయితే ఈ చారిత్రక కట్టడానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కసరత్తు ప్రారంభించారు.
మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్‌ను ఆధునీకరించి మధ్యతరగతి ప్రజలు వినియోగించుకునే విధంగా ఆధునిక ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ క్రమంలో టౌన్ హాల్‌ను సందర్శించిన మంత్రి అభివృద్ధికి సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
