PRAKASAM
ప్రకాశం జిల్లా
ఇది ప్రకాశం జిల్లా!
నల్లమల పర్వతాలు ఈ జిల్లాకు సహజ అందం.
భైరవకొండ గుహాలయాలు కొండల మధ్య ఉన్న చారిత్రక కట్టడం.
చీమకుర్తి గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఒంగోలు ఎద్దులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు.
వ్యవసాయం, ఖనిజ సంపద కలిసిన జిల్లా.
మార్కాపురం జిల్లాలో గిరిజన తండాలకు సోలార్ విద్యుత్
పాలుట్ల తండాలో 611 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం
రూ.2.86 కోట్ల వ్యయంతో ఆఫ్-గ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్
ప్రతి ఇంటికి ఫ్యాన్, ఐదు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు
గిరిజన తండాల్లో తొలిసారిగా వెలుగులు
మార్కాపురం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తండాలకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా విద్యుత్ సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల గిరిజన తండాలకు ప్రభుత్వం ఆఫ్-గ్రిడ్ సోలార్ పథకం ద్వారా విద్యుత్ అందించింది. దీంతో దశాబ్దాలుగా అంధకారంలో జీవిస్తున్న గిరిజన కుటుంబాల ఇళ్లలో వెలుగులు నిండాయి. ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ కుమార్ అందిస్తారు.
