NELLOORE
నెల్లూరు జిల్లా
ఈ జిల్లాలో వరి పంట విస్తృతంగా సాగుతుంది.
అదనంగా చేపల పెంపకం మరియు ఆక్వా కల్చర్ పెద్ద ఎత్తున జరుగుతుంది.
కూరగాయల సాగు కూడా రైతులు ఎక్కువగా చేస్తున్నారు.
సముద్రానికి సమీపం కావడంతో మత్స్యకారం అభివృద్ధి చెందింది.
వ్యవసాయం ఈ జిల్లాలో ప్రధాన జీవనాధారం.
నెల్లూరు జిల్లాలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లాలో 174 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు
16 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
అవకతవకలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన భద్రత
నెల్లూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 174 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. బాలాజీ రావు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అవసరమైన బెంచీలు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
