NELLORE GOOD MORNIG AP
నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతం విస్తరించింది.
పెన్నా నది ఈ జిల్లాలో ప్రధానంగా ప్రవహిస్తుంది.
పులికాట్ సరస్సు ఈ ప్రాంతంలో ఉంది.
తీర మైదానాలు విస్తరించాయి.
నది–సముద్ర తీర ప్రాంత కలయిక నెల్లూరు ప్రత్యేకత.
నెల్లూరు జిల్లాలో అధ్వానంగా మారిన బస్టాప్స్
వేసవి తీవ్రత పెరుగుతున్న తెరుచుకోని బస్టాప్స్
వినియోగంలోకి రాకపోవడంతో ప్రజల అవస్థలు
అన్ని రకాల బస్టాప్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి
నెల్లూరు జిల్లాలో వేసవి ఎండలు మండుతున్నా బస్టాప్స్ మాత్రం తెరుచుకోవడం లేదు. పేరు గొప్ప.. ఊరు దిబ్బలా నెల్లూరు బస్టాప్స్ పరిస్థితి తయారైంది. బస్సులు, ఆటోల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు వేసవి వేడిమికి తలదాచుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు.
ఇదిలా ఉండగా నగరంలో ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వ పెద్దాసుపత్రి, కూరగాయల మార్కెట్, నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నాన్ ఏసీ బస్టాప్‌లు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని పూర్తిగా దెబ్బతినగా, మరికొన్నింటిని బిక్షగాళ్లు నివాసంగా మార్చుకున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో నగరంలోని ఏసీ బస్ స్టాప్ లతో పాటు అన్నీ రకాల బస్టాప్స్ ను అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ అందిస్తారు.
