NELLORE GOOD MORNING AP
నెల్లూరు జిల్లా
పులికాట్ సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద లగూన్‌గా గుర్తింపు.
వలస పక్షులు భారీగా ఇక్కడికి చేరుతాయి.
కృష్ణపట్నం పోర్ట్ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం.
వెలిగొండ పర్వతాలు సహజ రక్షణలా ఉన్నాయి.
ఆక్వా కల్చర్ విస్తరించి ఉంది.
చేపల ఉత్పత్తిలో ముందంజలో ఉంది.
ప్రకృతి, వాణిజ్యం కలిసిన జిల్లా.
నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత
ఫిషింగ్ హార్బర్ పైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం
అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
మత్స్యకారుల్లో, జిల్లా వాసుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్న వైసీపీ
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ గురించి మత్స్యకారుల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు, అధికారులు, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం, అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు. జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్య్స కారులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వమే ముందుండి పరిష్కరిస్తుందని తెలిపారు. సమస్యలు ఏమైనా స్థానిక నాయకుల సహకారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖా-ముఖి చర్చల ద్వారా భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన పెంపొందిస్తూ, ఫిషింగ్ హార్బర్ పరిరక్షణ, నిర్వహణకు సంబంధించి స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి సూచనలు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ అందిస్తారు.
