PALNADU
పల్నాడు జిల్లా – వింతలు, విశేషాలు
పల్నాడు యుద్ధం చారిత్రకంగా ప్రసిద్ధి.
మాచర్ల సమీపంలోని నాగార్జునసాగర్ జలాశయం ప్రధాన నీటి వనరు.
పల్నాటి వీరుల గాథలు ప్రజా కథల్లో ప్రసిద్ధి.
వ్యవసాయం ప్రధాన జీవనాధారం.
చారిత్రక కోటలు, దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
పల్నాడులో విద్యార్థులకు సైకాలజికల్ కౌన్సిలింగ్
మానసిక ఆరోగ్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
11 మండలాలకు సైకాలజికల్ కౌన్సిలర్ల నియామకం
చెడు వ్యసనాల నుంచి విద్యార్థులను దూరం చేసే ప్రయత్నం
విద్యార్థుల మానసిక దృఢత్వానికి కొత్త చర్యలు
విద్యార్థుల ఎదుగుదలకు మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు క్రమశిక్షణ మరియు మానసిక పరిపక్వత కూడా ఎంతో అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగానికి అలవాటు పడుతూ వివిధ ప్రభావాలకు లోనవుతున్నారు.
సెల్ ఫోన్ల ద్వారా హింసాత్మక దృశ్యాలు, అనుచిత కంటెంట్ వీక్షించడం వల్ల కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కోమర దశలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి సైకాలజికల్ కౌన్సిలింగ్ అందించే చర్యలు చేపట్టింది.
గత ఏడాది పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో ప్రతి మూడు మండలాలకు ఒకరు చొప్పున సైకాలజికల్ కౌన్సిలర్లను నియమించారు. తాజాగా ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రతి మండలానికి ఒకరు చొప్పున నియమించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
తొలివిడతగా జిల్లాలోని 11 మండలాలకు సైకాలజికల్ కౌన్సిలర్లను నియమించినట్లు జిల్లా సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు. ఈ చర్యలతో విద్యార్థుల్లో మానసిక దృఢత్వం పెరగడంతో పాటు సరైన మార్గదర్శనం అందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై మరిన్ని వివరాలను మా పల్నాడు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను లైవ్‌లో వివరిస్తారు.
