MARKAPURAM GOOD MORNING AP
ప్రకాశం జిల్లా – ఇంట్రో
ఇది ప్రకాశం జిల్లా!
ఒంగోలు ఎద్దులు దేశవ్యాప్తంగా ‘చాలా ఫేమస్’.
చీమకుర్తి గ్రానైట్ ప్రపంచ మార్కెట్లో గుర్తింపు పొందింది.
భైరవకొండ గుహాలయాలు చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.
వ్యవసాయం, ఖనిజ సంపద ఈ జిల్లాకు ప్రధాన బలం.”
TOPS:
దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన
సిలిండర్ల బుకింగ్ కాలాన్ని 25 నుంచి 45 రోజులకు పెంచిన కేంద్రం
సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం
MARKAPURAM GOOD MORNING AP
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది. అయితే, ఈ నిబంధన కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. నగరాల్లో పాత నిబంధనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కొరత సాకుతో కమర్షియల్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలో అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పనిచేస్తున్నాయని పేర్కొంది. సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డిజీల్ సరఫరా చేస్తున్నామని వాహనాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక ఇదే అంశంపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు.
