SRIKAKULAM GOOD MORNING AP
శ్రీకాకుళం జిల్లా – ఇంట్రో
ఇది శ్రీకాకుళం జిల్లా!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ‘చాలా ప్రత్యేకమైన’ దేవాలయం.
శ్రీకూర్మం ఆలయం తాబేలు ఆకారంలో నిర్మించబడింది.
వంశధార, నాగావళి నదులు వ్యవసాయానికి ప్రధాన ఆధారం.
సాంప్రదాయ సంస్కృతి ఇక్కడ ‘గట్టిగా కొనసాగుతోంది’.”
TOPS:
ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో చారిత్రక ముందడుగు
పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
27 ఏళ్ల యువతికి కిడ్ని మార్పిడి చేస్తున్నాం: ఎమ్మెల్యే గౌతు శిరీష
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు
SRIKAKULAM GOOD MORNING AP
దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించనున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని, తమ చిత్తశుద్ధికి నిలువుటద్దమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఆమె తండ్రి, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మోహన్ రావు ముందుకు రావడం విశేషమన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, వైద్యులు పూర్తి బాధ్యత తీసుకుని ఈ ఆపరేషన్ ఏర్పాట్లు చేశారన్నారు. వైజాగ్, శ్రీకాకుళం నుండి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందాన్ని ఈ ఆపరేషన్ కోసం పలాసకు రప్పించినట్లు తెలపారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం మొత్తం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే శిరీష వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు.
