KURNOOL GOOD MORNING AP
కర్నూలు జిల్లా
బెలుమ్ గుహలు భారతదేశంలో రెండవ అతిపెద్ద గుహలు.
యాగంటి నందీ విగ్రహం పెరుగుతోందని నమ్మకం.
నల్లమల అడవులు వన్యప్రాణులకు నిలయం.
పురాతన దేవాలయాలు విస్తరించి ఉన్నాయి.
గుహల్లో సహజ గాలిమార్గాలు ఉన్నాయి.
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ.
ప్రకృతి, మిస్టరీ కలిసిన జిల్లా.
శ్రీశైలంలో అక్రమ మద్యంపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
శ్రీశైలం, సున్నిపెంట పరిసరాల్లో అధికారులు మెరుపు దాడులు
వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన అధికారులు
21 మద్యం బాటిళ్లు, 29.5 లీటర్ల నాటుసారాయి స్వాధీనం
ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్రమ మద్యం తయారీ, విక్రయంపై కఠిన చర్యలు
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల వేళ అక్రమ మద్యంపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. నంద్యాల జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. రాముడు ఆధ్వర్యంలో శ్రీశైలం, సున్నిపెంట పరిసరాల్లో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నాటుసారాయి, అక్రమ మద్యం పట్టుబడటంతో పాటు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో, భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన 21 మద్యం బాటిళ్లు, 29.5 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతాలైన ఎలుగుబంటి సెల, బూడిద సెల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. నాటుసారాయి తయారీ కోసం సిద్ధంగా ఉంచిన సుమారు 1400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు.
