VIJAYANAGARAM GOOD MORNING AP
విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో ఉంది.
తూర్పు ఘాట్ కొండలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
నాగావళి నది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.
కొండలు, మైదానాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
చిన్న వాగులు, చెరువులు నీటి వనరులు.
పర్వత–మైదాన ప్రాంతాల కలయిక విజయనగరం ప్రత్యేకత
విజయనగరం జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు
తనిఖీల్లో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు
టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిందని ఆరోపణలు
ఏసీబీ అధికారులు విజయనగరం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు సిబ్బందిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతులలో అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లోతైన విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.విజయనగరం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోందని, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ బి.శ్రీనివాస్ అందిస్తారు.
