WEST GODAVARI
పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా సారవంతమైన వ్యవసాయ భూములతో ప్రసిద్ధి.
గోదావరి నది కాలువలు ఈ ప్రాంతానికి జీవనాధారం.
పచ్చని వరి పొలాలు ప్రకృతి అందాలను పెంచుతాయి.
ఆక్వా సాగు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది.
వ్యవసాయం, ఆక్వా రంగం కలిసిన జిల్లా పశ్చిమ గోదావరి.
• అంతర్జాతీయ సెగతో విలవిల్లాడుతున్న ఆక్వా రైతులు
• ఇరాన్–అమెరికా యుద్ధ ప్రభావం… పడిపోతున్న రొయ్యల ధరలు
• ఎగుమతులు నిలిచిపోవడంతో కుదేలైన పశ్చిమగోదావరి ఆక్వా రంగం
• మార్కెట్ పతనం… ఆందోళనలో రొయ్యల సాగుదారులు
• అంతర్జాతీయ పరిణామాలతో నష్టాల్లో ఆక్వా రైతన్న
పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఆక్వా రంగంపై తీవ్రంగా పడుతోంది. ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం… మరోవైపు మార్కెట్‌లో అమాంతం పడిపోతున్న రొయ్యల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి.
ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యల సాగు రైతులు విలవిల్లాడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.
