WEST GODAVARI GOOD MORNING AP
పశ్చిమ గోదావరి జిల్లా
ఇది పశ్చిమ గోదావరి జిల్లా!
తూర్పు ఘాట్ పర్వతాల అంచులు ఈ ప్రాంతానికి సహజ అందం ఇస్తాయి.
ద్వారకా తిరుమల కొండపై చిన్ని తిరుపతి ఆలయం ఉంది.
భీమవరం ప్రాంతం చేపల పెంపకానికి ప్రసిద్ధి.
సారవంతమైన భూముల్లో పంటలు బాగా పండుతాయి.
వ్యవసాయం, ప్రకృతి కలిసిన ప్రాంతం ఇదే.
పశ్చిమ గోదావరి జిల్లాలో రైతన్నా మీకోసం కార్యక్రమం
16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహణ
పొలాల్లో పంటల స్థితిగతులను పరిశీలించనున్న అధికారులు
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన
రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తోంది. అన్నదాతల ముంగిటకే అధికార యంత్రాంగం చేరువ అయ్యేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రైతన్నా నీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అధికారులే నేరుగా పొలాల్లోకి వెళ్లి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. రైతులకు ఎదురయ్యే సాగు ఇబ్బందులు, మట్టి పరీక్షలు, విత్తన మరియు ఎరువుల లభ్యతపై అక్కడికక్కడే సూచనలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు నిపుణుల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.
