CHITTOOR
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా కొండలు, అడవులు, నదులతో ప్రసిద్ధి.
తిరుమల కొండలు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక గుర్తింపు.
స్వర్ణముఖి నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
పచ్చని తోటలు, పర్వత ప్రాంతాలు ప్రకృతి అందాలు పెంచుతాయి.
ఆధ్యాత్మికతతో కూడిన ప్రకృతి సోయగాలు చిత్తూరు ప్రత్యేకత.
• YK TV కథనానికి స్పందన
• పేద కుటుంబానికి సహాయం అందించిన హ్యూమన్ రైట్స్ టీం
• నిత్యవసర సరుకులు, గ్యాస్ సిలిండర్ పంపిణీ
• ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి కృత్రిమ కాలు హామీ
• ఇల్లు నిర్మించి ఇవ్వాలని పిల్లల విజ్ఞప్తి
• వైకే టీవీకి కుటుంబం కృతజ్ఞతలు
చిత్తూరు జిల్లా సముద్రపల్లి జగనన్న ఎస్.టి కాలనీలో చిన్నపిల్లల కన్నీటి గాధగా YK TVలో ప్రసారమైన కథనానికి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 17న ప్రసారమైన ఆ కథనం చూసిన హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అధ్యక్షుడు మాదేశ్ తన బృందంతో కలిసి ఆ పేద కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబానికి నిత్యవసర సరుకులు, గ్యాస్ సిలిండర్, బట్టలు అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన కుటుంబ పెద్ద రామానుజులకు త్వరలో కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తల్లి లేకపోయినా ఇద్దరు చిన్నపిల్లలు తండ్రిని చూసుకుంటున్న పరిస్థితి మనసును కలిచివేస్తోందని రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలు ప్రవళిక అన్నారు. ప్రభుత్వం సహకరించి వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా కోరారు.
తమ ఇల్లు వర్షం పడితే నీటితో నిండిపోతుందని, పాముల బెడద కూడా ఉందని పిల్లలు తెలిపారు. వైకే టీవీ ద్వారా ప్రభుత్వం సహాయం చేయాలని వారు వేడుకున్నారు. వైకే టీవీ కథనం వల్లే తమ సమస్య వెలుగులోకి వచ్చిందని కుటుంబ పెద్ద రామానుజులు కృతజ్ఞతలు తెలిపారు.
