కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల సందర్భంగా పోలీసుల చర్యలపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఆందోళనల సమయంలో పోలీసుల చర్యలు, పరిణామాలపై కమిటీ విచారణ చేపట్టనుంది.


