బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని మంత్రి రవీంద్ర అన్నారు. పటేల్ పట్వారి, కరణం మునసబు వ్యవస్థలు ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, సీఎం చంద్రబాబు 34 శాతానికి పెంచారన్నారు. 1995 నుండి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతుంటే.. జగన్ రెడ్డి కుట్ర చేసి 24 శాతానికి కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.


