శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ మానవ్ సుతార్ 6/55తో సత్తాచాటగా, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462, శ్రీలంక 284 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్‌కు ఇది 600వ టెస్టు కావడం విశేషం.


