విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ లింగమనేని రమేశ్‌కు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వీ.కే. సీనా నాయక్, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ, తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.


