ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కేరళకు వెళ్లనున్నారు. అక్కడి ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో సుమారు 20 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకోనున్నారు. తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతున్న పవన్ కల్యాణ్.. ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. కేరళలోని ప్రకృతి వైద్య శిబిరంలో చికిత్స పొందనున్నారు. 20 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఏపీకి రానున్నారు.


