విశాఖ వన్‌టౌన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్లో టీచర్ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. క్లాస్‌రూమ్‌లోనే బాలుడు కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కేజీహెచ్ వద్ద, స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బాలుడి మృతికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు.


