సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం సాధించారు. ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు రవిశంకర్ న్యాయసలహాదారుగా సేవలందించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా ఎన్నికల్లో విజయం సాధించడంతో న్యాయవాద వర్గాలు రవిశంకర్‌కు అభినందనలు తెలిపాయి.


