బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉన్న ఎయిరిండియా విమానం, ఇంతవరకూ బయల్దేరకపోవడంతో బెంగళూరు విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.


