తమిళనాడులోని మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రతినిధులు, సీఎంలు, సీనియర్ మంత్రులు, సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర–రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, నీటి భాగస్వామ్యం, మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు ఏపీకి సంబంధించిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.


