విశాఖపట్నంలో ఏఐజీ (AIG) ఆసుపత్రి నిర్మాణానికి ఆ సంస్థ ఛైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ ఆసుపత్రి ద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.


