అమరావతిలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు పరిహారం అందజేశారు. సుమారు రూ.200 కోట్ల మేర పరిహారం చెక్కులను నిర్వాసితులకు అందించారు. కూటమి ప్రభుత్వం తమకు అందించిన సాయం ఎప్పటికీ మర్చిపోలేమని నిర్వాసితులు తెలిపారు. సీఎం చంద్రబాబు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని, 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల ఇప్పుడు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.


