PALNADU
పల్నాడు జిల్లా
వ్యవసాయం, నాగార్జునసాగర్ నీటిపారుదలపై ఆధారపడిన పల్నాడు జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. చరిత్ర–ప్రస్తుత సవాళ్లు కలిసిన ప్రాంతం ఇది. ఇప్పుడు జిల్లా ప్రధానాంశం.
పల్నాడు జిల్లాలో మెప్మా ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు
8 మందిపై కంప్లైట్ చేసిన జిల్లా మహిళ సమైక్య అధ్యక్షురాలు అఖిల
నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయలు కొట్టేశారని ఫిర్యాదు
ఏ5 నిందితురాలు గుడికందుల భూదేవికి రిమాండ్ విధించిన నరసరావుపేట కోర్టు
నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెప్మాలో జరిగిన అవకతవకలపై జిల్లా మహిళ సమైక్య అధ్యక్షురాలు అఖిల 8 మంది మహిళా మెప్పా ఉద్యోగులపై ఫిర్యాదు చేసింది. నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయలు కొట్టేశారని ఫిర్యాదు చేశారు. స్కామ్ పై విచారించాలని వారి పైన తగు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని, పోలీసులను కోరారు. ఈ కేసులో ఏ5 నిందితురాలు గుడికందుల భూదేవిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
ఈ నేపథ్యంలో భూదేవికి 13 వ తేదీ వరకు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఘటనలో నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. స్కామ్ లో పాత్ర ఉన్న మిగిలిన 7 గురు ఉద్యోగులను త్వరలో పట్టుకుని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై పల్నాడు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను మరింత సమాచారం అందిస్తారు.


