ANATHAPURAM
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాయలసీమలో విస్తరించిన మైదాన ప్రాంతం.
డెక్కన్ పీఠభూమిలో ఈ జిల్లా భాగంగా ఉంది.
చిన్న కొండలు, గుట్టలు ప్రాంతంలో కనిపిస్తాయి.
పెన్నా నది పరివాహక ప్రాంతం ఈ జిల్లాలో ఉంది.
పొడి మైదాన భూభాగం అనంతపురం భౌగోళిక లక్షణం.
అనంతపురం సర్వజన వైద్యశాలలో రోగులకు అసౌకర్యం
వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పెద్ద డాక్టర్స్
రోగులకు చికిత్స చేయకుండా జీతాలు తీసుకునేందుకే పరిమితమయ్యారని విమర్శలు
పెద్ద డాక్టర్లు విధులకు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు
సర్వజన వైద్యశాలలో ఉద్యోగం కేవలం హోదాగా మారిందని ఆరోపణలు
అనంతపురం సర్వజన వైద్యశాల రోగులకు సమగ్రమైన వైద్య సేవలు అందించడంలో వెనుకబడుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలో నిరంతర సేవలు అందాల్సినప్పటికీ, పెద్ద డాక్టర్లు ఎక్కువగా హాజరు కావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. సీనియర్ రెసిడెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు మాత్రమే ఓపీలో కూర్చుని వైద్యం చేస్తున్నారు. అనుభవం తక్కువగా ఉన్న వైద్యుల ద్వారా రోగులకు నామమాత్రపు చికిత్స మాత్రమే అందుతోంది.
చాలా మంది వైద్యులకు సర్వజన వైద్యశాలలో ఉద్యోగం కేవలం హోదాగా మారిపోయిందని రోగులు మండిపడుతున్నారు. వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా, రోగులకు చికిత్స చేయకుండా జీతాలు తీసుకునేందుకు పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో వున్న పెద్దసుపత్రిలో పెద్ద డాక్టర్లు విధులకు రాకపోవడంతో రోగులకు పాట్లు తప్పడం లేదు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయిప్రసాద్ అందిస్తారు.
