PRAKASAM
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన నల్లమల కొండలు విస్తరించాయి.
గుండ్లకమ్మ నది ఈ జిల్లాలో ప్రధాన జలవనరు.
వెలిగొండ కొండలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణంలో భాగం.
తీరప్రాంతం–కొండలు కలిసిన భౌగోళిక స్వరూపం ప్రకాశం జిల్లాకు ప్రత్యేకత.
ఒంగోలులో మార్చి మొదటి వారంలోనే మండుతున్న ఎండలు
ఉదయం నుంచే ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఒంగోలు,మార్కాపురం, దర్శి, కనిగిరి, ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సూర్యభగవానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా వేసవి పూర్తిగా మొదలుకాకముందే మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఒంగోలు,మార్కాపురం, దర్శి, కనిగిరి, ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల ప్రభావం ఎలా ఉందో తాజా పరిస్థితిపై మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు.
