GUNTUR GOOD MORNING AP
గుంటూరు జిల్లా – వింతలు, విశేషాలు
గుంటూరు మిర్చి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి.
ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ గుంటూరులో ఉంది.
అమరావతి బౌద్ధ స్తూపం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలు చారిత్రకంగా ప్రసిద్ధి.
వ్యవసాయం మరియు వాణిజ్యం ఈ జిల్లాలో అభివృద్ధి చెందాయి.
పొన్నూరులో విద్యుత్ అదాలత్ ఏర్పాటు
CGRF అధ్యక్షుడు ఇమ్మానుయేలు అధ్యక్షతన సమావేశం
వినియోగదారుల ఫిర్యాదులను సేకరించిన జస్టిస్ విక్టర్
గుంటూరు జిల్లా పొన్నూరులో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు విద్యుత్ అదాలత్ నిర్వహించారు. CGRF అధ్యక్షుడు జస్టిస్ విక్టర్ ఇమ్మానుయేలు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొన్నూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలలోని విద్యుత్ వినియోగదారులైన వ్యాపార సంస్థలు, రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులు, ఇంటి బిల్లు ఎక్కువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అదాలత్‌లో విద్యుత్ శాఖకి చెందిన అన్ని స్థాయిల అధికారులు పాల్గొన్నారు.
వినియోగదారుల ఫిర్యాదులను సేకరించిన జస్టిస్ విక్టర్ ఇమ్మానుయేలు వాటిని సమీక్షించి తక్షణమే పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక, విజయవాడలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.
