ANAKAPALLI GOOD MORNIN AP
అనకాపల్లి జిల్లా – వింతలు, విశేషాలు
అనకాపల్లి జగ్గరీ (బెల్లం) మార్కెట్‌కు ప్రసిద్ధి.
నూకలమ్మ అమ్మవారి జాతర ఈ జిల్లాలో ప్రముఖ ఉత్సవం.
చెరకు సాగు ఈ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతుంది.
విశాఖపట్నం సమీపంలో ఉండటంతో పరిశ్రమల అభివృద్ధి కనిపిస్తుంది.
తీర ప్రాంతం మరియు కొండ ప్రాంతం కలిసిన భౌగోళిక నిర్మాణం ప్రత్యేకం.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నక్కపల్లి హాకీ క్రీడాకారులు
2016 నుంచి హాకీ క్రీడలో ఉచిత శిక్షణ ఇచ్చిన కళాకారులు
హాకీ క్రీడ అభివృద్ధికి ప్రభుత్వం సహాయం సహకారాలు అందించాలని విజ్ఞప్తి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హాకీ క్రీడలను కానిస్టేబుల్ బలిరెడ్డి సూరిబాబు, పొలనాటి తాతాజీ పరిచయం చేశారు. 2016 నుండి ఈ హాకీ క్రీడ శిక్షణను ఉచితంగా అందించి, క్రీడాకారులకు అన్ని విధాల సహాయం అందించినవారిలో వారు ముఖ్య పాత్ర పోషించారు. వారి కృషితోనే 200 పైగా క్రీడాకారులు తయారయ్యారు. ఈ క్రీడాకారుల్లో సుమారు 30 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించి, 15 మంది ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతావారు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను పొందారు.
అంతేకాకుండా, కొంతమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను ప్రదర్శించి ఉత్తరాంధ్రా రాష్ట్రానికి ప్రతిష్టను పెంపొందిస్తున్నారు. రాష్ట్రంలో హాకీ మినీ టర్ఫ్ కోర్టుు మూడు మాత్రమే ఉన్నాయని తెలిపారు. క్రీడాకారులు, నిర్వాహకులు హాకీ క్రీడ అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహాయ సహకారం అందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు.
