ANAKAPALLI
అనకాపల్లి జిల్లా
ఈ జిల్లా చెరకు సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందింది.
అనకాపల్లి బెల్లం మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖది.
ఇక్కడ రైతులు వరి, చెరకు, కూరగాయలు విస్తృతంగా పండిస్తారు.
సారవంతమైన భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి.
వ్యవసాయం ఈ ప్రాంత ప్రజలకు ప్రధాన జీవనాధారం.
పాయకరావుపేట పట్టణ అభివృద్ధిపై ప్రజల ఆందోళన
విద్య, వైద్యం కోసం ఇతర పట్టణాలపై ఆధారం
నియోజకవర్గ కేంద్రానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించాలని విజ్ఞప్తి
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలపై ఆశలు
అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గ ప్రధాన కేంద్రంగా ఉన్న పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్యం వంటి ముఖ్య అవసరాల కోసం సమీప పట్టణాలపై ఆధారపడాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ప్రధాన కేంద్రానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. స్థానికంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా తెలియజేసుకునే విధంగా ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు హోం మంత్రి అనిత ప్రజా దర్బార్ నిర్వహిస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
