VISAKHAPATNAM
విశాఖపట్నం జిల్లా
కొండ ప్రాంతాల్లో కాఫీ సాగు ప్రసిద్ధి.
అదనంగా వరి, జొన్న పంటలు కూడా సాగుతాయి.
కూరగాయల సాగు కూడా రైతులు చేస్తున్నారు.
ప్రకృతి పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
వ్యవసాయం మరియు తోటల సాగు ఈ జిల్లాలో అభివృద్ధి చెందాయి.
పట్టణ అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ కీలకం
విశాఖలో ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహణ
మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణపై చర్చ
పట్టణ స్థానిక సంస్థల సామర్థ్య పెంపుపై దృష్టి
పలు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం
పట్టణాల సమగ్ర అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ అత్యంత అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మున్సిపల్ బాండ్లు, క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించే అవకాశాలపై ప్రాంతీయ స్థాయి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు.
