KADAPA
కడప జిల్లా
రాయలసీమ ప్రాంతమైన ఈ జిల్లాలో వేరుశెనగ ప్రధాన పంట.
అదనంగా పత్తి, వరి పంటలు కూడా సాగుతాయి.
కొన్ని ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి తోటలు ఉన్నాయి.
వర్షాధార వ్యవసాయం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యవసాయం ఈ ప్రాంత రైతుల జీవనాధారంగా కొనసాగుతోంది.
కడపలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం
యువతలో మాదకద్రవ్యాల ప్రభావంపై ఆందోళన
17,18 తేదీల్లో అవగాహన సదస్సులు
డ్రగ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపు
కడప జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ అన్నారు. కడపలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో జిల్లా వ్యాప్తంగా యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
